© 2026 nimisham.in

అమృతలూరు: మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రిటైల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్న 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు బుధవారం పారిశ్రామిక సందర్శన నిర్వహించారు.
రిటైల్ రంగంపై ప్రాక్టికల్ అవగాహన కోసం చెరుకుపల్లిలోని రిలయన్స్ స్మార్ట్ ఫ్రెష్కు విద్యార్థులను తీసుకెళ్లారు. స్టోర్ మేనేజర్ కరీముల్లా, సిబ్బంది రిటైల్ నిర్వహణ, స్టాక్ నిర్వహణ, బిల్లింగ్, కస్టమర్ సేవలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నిరీక్షణరావు, ఉపాధ్యాయులు రవి, ఆదినారాయణ, వెంకటేశ్వరరావు, శ్రీకాంత్, ఆనంద్, శ్రీవిద్య, ప్రశాంతి, విజయకుమారి పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.