© 2026 nimisham.in

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Pawan Kalyan Flop Movies List: ఉస్తాద్ భగత్ సింగ్:‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ డిజాస్టర్గా నిలిచింది.
పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో అత్యధిక రోజులు షూటింగ్ జరుపుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. గతేడాది రిలీజైన ఈ పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిజాస్టర్గా నిలిచింది.
ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మెగాఫోన్ పట్టుకొని తెరకెక్కించిన చిత్రం‘జానీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా..అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అజ్ఞాతవాసి.. త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ‘అజ్ఞాతవాసి’. వీళ్ల కలయికలో వచ్చిన మూడో సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అన్న నాగబాబు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘గుడుంబా శంకర్’. వీర శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
తొలి ప్రేమ తర్వాత డైరెక్టర్ ఏ.కరుణా కరణ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘బాలు’. ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై టాప్ డిజాస్టర్ మూవీగా నిలిచింది.
‘ఖుషీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎస్.జే.సూర్య కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘కొమరం పులి’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
విష్ణువర్ధన్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పంజా’. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
పవన్ కళ్యాణ్ తొలిసారి రెండు విభిన్న పాత్రల్లో యాక్ట్ చేసిన ‘తీన్మార్’. ఈ చిత్రం పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
బాబీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ సమర్పణలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపూై తెరకెక్కిన చిత్రం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
కిషోర్ పార్ధసాని డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కాటమ రాయుడు’. ఈ సినిమా బాక్సాఫీస దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
మొత్తంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ..బాలూ, బంగారం, అన్నవరం, బ్రో వంటి డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.