© 2026 nimisham.in

కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ చార్జ్‌షీట్ విడుదల కేటీఆర్ తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు రైతులు, నిరుద్యోగుల మోసంపై ఫైర్ BRS Charge Sheet: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని...
కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ చార్జ్‌షీట్ విడుదల కేటీఆర్ తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు రైతులు, నిరుద్యోగుల మోసంపై ఫైర్ BRS Charge Sheet: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఒక ప్రత్యేక చార్జ్‌షీట్(BRS Charge Sheet)ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వెయ్యి రోజుల పీడనగా మారిందని, ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోందని విమర్శించారు. ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ACB సోదాలు.. 15 ఏళ్ల తర్వాత రైడ్.. కీలక పత్రాలు స్వాధీనం అభివృద్ధి శూన్యం.. అప్పుల మయం: కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ సెటైర్లు వేస్తూ "అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐమ్యాక్స్" తరహాలో ఉందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోయినా రూ. 4.50 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. పేదల భూములను నిషేధిత జాబితాలో చేర్చి 30 శాతం కమీషన్లు దండుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టే విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు పోటీ పడుతున్నారని, తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరిలా మార్చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. రైతాంగానికి కుచ్చుటోపీ.. రుణమాఫీ, రైతుబంధుపై విమర్శలు: రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. రూ. 50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టువేసి, కేవలం రూ. 20 వేల కోట్లు మాత్రమే చేసి 70 శాతం మంది రైతులకు కుచ్చుటోపీ పెట్టారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణను అన్నపూర్ణగా మారిస్తే, ఇప్పుడు 'రైతుబంధు'ను బంద్ చేసి 'రాహుల్ బంధు'ను అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షకట్టి రైతులకు సాగునీరు అందకుండా శిక్షిస్తున్నారని, మిస్ వరల్డ్ పోటీలు, మెస్సీ పర్యటనల కోసం వందల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి రైతులకు నీళ్లు ఇచ్చేందుకు మాత్రం నిధులు ఉండటం లేదని మండిపడ్డారు. Gold Silver Price Today: బంగారం కొనేవారికి భారీ ఊరట.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే? నిరుద్యోగులను ముంచేశారు.. ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ధ్వజం: యువతకు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, జాబ్ క్యాలెండర్ పేరుతో 'జాబ్‌లెస్ క్యాలెండర్' ఇచ్చి నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో ప్రజాస్వామ్య సూక్తులు చెప్పే రాహుల్ గాంధీ పార్టీ, తెలంగాణలో మాత్రం నిరుద్యోగులపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీకి మూటలు పంపడం, పదవుల కోసం కీచులాడుకోవడం తప్ప ప్రజాసంక్షేమం పట్టడం లేదని, గోదావరి-కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.